ibomma: దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరితే… చూస్తూ ఊరుకుంటారు.. తాట తీశారు సీపీ సజ్జనార్. సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్…
CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జానార్ తెలిపారు.. రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని చెప్పారు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉందన్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడన్నారు..…