Hyderabad: హైదరాబాద్ నగరం అంటే సినిమాలకు పెట్టింది పేరు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమా విడుదలైందంటే అక్కడ ఉండే హడావిడి వేరు. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చాలా థియేటర్లు ఉండేవి. కానీ మల్లీప్లెక్సుల రాకతో థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఐదు థియేటర్లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అందులో సుదర్శన్ 35ఎంఎం, దేవి 70ఎంఎం, సంధ్య 70ఎంఎం, సంధ్య 35 ఎంఎం, సప్తగిరి 70ఎంఎం థియేటర్లు…
NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది.…
Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్‌లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో సంక్రాంతి శ్రుతిహాసన్‌దే అన్న చర్చ నడుస్తోంది. అయితే రెండు సినిమాల్లోనూ శ్రుతి పాత్రలు అంత గొప్పగా ఏం లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీలో పట్టుమని పావుగంట పాత్ర…
తెలుగునాట పుట్టినా, భారతీయ చిత్రసీమలోనే తనదైన బాణీ పలికిస్తూ సాగిన ఘనులు దర్శకనిర్మాత నటులు ఎల్.వి.ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్. వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు.…
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీలో వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ మూడురోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. అయితే ఓ వార్త మాత్రం అభిమానులకు కోపం తెప్పిస్తోంది. బరిలో మెగా, నందమూరి హీరోల సినిమాలు…
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొలిరోజు బాలయ్య సినిమా కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బాలయ్య కెరీర్‌లో మునుపెన్నడూ చూడనంత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వీరసింహారెడ్డి సినిమా సాధించింది. అయితే టాక్ మాత్రం వాల్తేరు వీరయ్యకు పాజిటివ్‌గా…
జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి 'వాల్తేరు వీరయ్య'గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ 'వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. 'నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ' అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది.