బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన ‘ఖామోషీ’ని గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా పేరు వినగానే వీరికంటే ముందుగా నానా పటేకర్, సీమా బిశ్వాస్ గుర్తుకు వస్తారు. ఇందులో మూగ, చెవిటి పాత్రల్లో ఆ ఇద్దరూ అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. వారి కూతురుగా మనీషా నటన సైతం ప్రశంసలు అందుకుంది.…