కర్ణాటకలో శుక్రవారం తెల్లవారుజామున కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ధర్మపురం జిల్లా తొప్పూర్-శివడి స్టేషన్‌ల మధ్య కొండచరియలు విరిగిపడి ట్రాక్‌పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 5 బోగీలు ట్రాక్ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. Read Also: దేశంలోనే తొలి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ కన్నూరు రైల్వేస్టేషన్ నుంచి గురువారం…
విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు…