ఛార్ ధామ్ యాత్రలో మృతుల సంఖ్య 31కి చేరిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. మే 4న ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 యాత్రికులు మరణించారని.. ఇందులో 30 మంది యాత్రికులు కాగా.. మరొకరు స్థానికంగా ఉండే వ్యక్తి అని ప్రభుత్వం ప్రకటించింది. 12 రోజుల్లోనే పదుల సంఖ్యలో యాత్రికులు మరణించారు. మరణాలకు ‘మౌంటైన్ సిక్ నెస్’తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యాయని ఉత్తరాఖండ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఎక్కువ…