టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. అతను 521 మ్యాచ్‌లు ఆడి చాలాసార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ హిట్టర్.. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడుతున్నాడు. ఆంటిగ్వా, బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అతను 4 బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు.