Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు…