Moringa: మునగ చెట్టును ఔషధ గుణాల ఖజానాగా నిపుణులు పేర్కొంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగమూ విశేషమైనదే. మునక్కాయలు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి మేలుచేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యంగా మునగాకు పోషక విలువలతో పాటు ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఆకు కూరల్లో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.