Moringa: మునగ చెట్టును ఔషధ గుణాల ఖజానాగా నిపుణులు పేర్కొంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగమూ విశేషమైనదే. మునక్కాయలు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి మేలుచేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యంగా మునగాకు పోషక విలువలతో పాటు ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఆకు కూరల్లో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
మునగాకు ఈ ఆకులో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మునగ చెట్టులోని ప్రతీ భాగం తినొచ్చు. దీంతో ఎన్నో లాబాలు అందుతాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగాకుల్ని ఎండబెట్టి పొడిలా చేసి తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. Read Also:HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో అందరిపై హెచ్ఐవీ రక్తం మునగాకుల్లో కాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు…