మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన 'మాన్ స్టర్' సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఉదయ్‌కృష్ణ రచయిత. ఈ సినిమాని గల్ఫ్ దేశాల్లో నిషేదించారు. ఎల్‌జీబీటీక్యూ సీన్స్ ఉండటం వల్లే ఈ సినిమాను నిషేదించినట్లు వినిపిస్తోంది.
మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. మోహన్ లాల్, ‘పులిమురుగన్’ దర్శకుడు వైశాఖ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘మాన్ స్టర్’ అనే పేరు పెట్టారు. నవంబర్ 11 నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఇందులో సర్దార్ లక్కీ సింగ్…