తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో…