Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది.