Mohit Sharma: వెటరన్ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల మోహిత్ బుధవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హర్యానా తరఫున ఆడటం నుంచి టీమిండియా జెర్సీ ధరించడం, ఆపై ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఇవ్వడం వరకూ తన ప్రయాణం అద్భుతమైనదని.. అది తనకు ఒక వరంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, ఎల్లప్పుడూ తనను సరైన దారిలో నడిపించిన…