మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో “దృశ్యం-3″ని ప్రకటించారు. కానీ ఇప్పుడు “దృశ్యం-3” కన్నా ముందే ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. జీతు, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఇంతకుముందు దృశ్యం, దృశ్యం 2 లాంటి సూర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ చిత్రానికి జీతూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగభాగం పూర్తయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పరిస్థితులు ఓకే అయ్యాక లండన్ లో కొత్త షెడ్యూల్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడు ప్రాజెక్ట్ లు రూపొందుతుండడం విశేషం. ఈ మూడు ప్రాజెక్ట్ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మోహన్ లాల్ నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం ‘మరక్కర్’, యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరట్టు’ చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ‘బారోజ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తొలిసారిగా డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టారు. మోహన్ లాల్ ఈ చిత్రాలతో పాటు ‘లూసిఫెర్ 2’, ప్రియదర్శన్ తో మరో ప్రాజెక్ట్ లో కూడా నటించనున్నారు.