రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ అంటే రైతులకు ఎంతో ఇష్టం. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటారు. ఈ ఏడాది నేడు అనగా జనవరి 13న భోగి పండుగను ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు. ఊరూరా, పల్లె పల్లెనా తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు కాలుస్తున్నారు. ఇలాంటి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముఖ్యంగా పిండి…