కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బద్వేల్ ప్రాంతంలో ఎన్నికల సంఘం ఆంక్షలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మొబైల్స్ పంపిణీ చేశారు డాక్టర్లు. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని 43 మంది ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం శాంసంగ్ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లు, చేతి…