వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…