తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎంత మందికి మళ్లీ ఛాన్స్ ఉంది? ఉపఎన్నికల్లో గెలిచి రెండేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నవారి సీటు సేఫేనా? టీఆర్ఎస్ అధిష్ఠానం లెక్కలేంటి? రెండేళ్లే ఎమ్మెల్సీగా ఉన్నవారికి రెన్యువల్..! తెలంగాణలో జనవరి నాలుగుతో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ పదిన పోలింగ్. ఆదిలాబాద్ జిల్లాలో పురాణం సతీష్, వరంగల్ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండలో జిల్లా తేర చిన్నపరెడ్డి, మెదక్ జిల్లాలో భూపాల్…