విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంఎస్ రాజు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంతబాబు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అనంతబాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏజెన్సీ ఏరియాలో అనంతబాబు…