మ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. నందకుమార్ ను విచారించేదుకు ఈడీ అధికారులు చంచల్ గూడా జైలుకు వెళ్లనున్నారు. నందకుమార్ ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ టీమ్ విచారించనున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చింది. అయితే క్రిస్మస్ సెలవులు ఉన్నందున ఈ నెల 26, 27 తేదీల్లో నందు కుమార్‌ను చంచల్‌గూడ జైలులో విచారించనున్నారు.