Ahead Of Gujarat Elections, Another Congress MLA Joins BJP: గుజరాత్ లో బీజేపీ అధికారానికి గండికొడదాం అని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. వరసగా రెండు రోజుల్లో వ్యవధిలో ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ బుధవారం శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.