బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ 'దబాంగ్' సల్మాన్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.