క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ నాదే కానీ.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నగరంలోని బోడుప్పల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే.. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ తనదేనన్న మల్లారెడ్డి, అది 2022 మార్చి నాటిదని చెప్పారు. ఈనేపథ్యంలో..…