నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి అభివృద్ధి, ఇందిరమ్మరాజ్యం (అభివృద్ధి) తీసుకురావడానికి ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంతోపాటు మహిళలు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఐమాక్స్ లైట్లను ఆయన ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రాజేష్‌రెడ్డి ఈ ప్రాంతంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను విని, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సహకారంతో నీటి వసతి, గృహనిర్మాణం వంటి వారి సమస్యలను…