MLA Medipally Sathyam: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న తెలంగాణ ప్రజలు రెండు అపురూప దృశ్యాలు చూశారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నులపండువగా అత్యంత వైభవంగా జరిగిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారని తెలిపారు. గత పదేళ్లుగా ఈ దృశ్యం కోసం తెలంగాణ ప్రజలు, రామభక్తులు ఎదురు చూస్తున్నాట్లు ఆయన పేర్కొన్నారు.…