నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్‌లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది.