వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్‌లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్…