నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేతల మధ్య పోరు చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నారాయణపై అనిల్ విరుచుకుపడ్డారు. నెల్లూరు నగరంలో ఏ బిల్డర్ లేదా, వ్యాపారినైనా గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి.. అనిల్ నుంచి ఫోన్ వచ్చిందని. వ్యాపారస్తులను ఏనాడు తాను ఇబ్బంది పెట్టలేదని అనిల్ చెప్పారు.