ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. గత మూడు మ్యాచ్ లలో విఫలమైన బ్యాటర్లంతా నిన్న( శుక్రవారం ) జరిగిన మ్యాచ్ లో ధాటిగా ఆడారు. ఓపెనర్లు యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్(38 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (19 బంతుల్లో 25, 5 ఫోర్లు )లు చిత్తకొట్టారు. వీరి దూకుడుతో నిర్ణత 20 ఓవర్లలో…