ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. టీ20 ప్రపంచకప్ 2026కు కొన్ని నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే జనవరిలో 36 ఏళ్ల పడిలోకి వెళ్లనున్న స్టార్క్.. టెస్ట్‌లు, వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దేశవాలీ టీ20 లీగ్ సహా ఐపీఎల్‌కు కూడా తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు. భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని..…