Sri Tej :అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ షో తొక్కిసలాటను ఎవరూ మర్చిపోలేదు. సంధ్య థియేటర్ లో జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. కోలుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో శ్రీతేజ్ కు అండగా నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ట్రీట్ మెంట్ ఖర్చులు భరిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిషన్ వాత్సల్య పథకాన్ని అందిస్తామని ప్రకటించింది.…