Mission Bhagiratha : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. సోమవారం నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు పనిచేయనున్న…