భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.