Mirchowk Fire Accident : హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.…