Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా భాలుకాలో గురువారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఓ హిందూ వర్కర్‌ని కొట్టి చంపేశారు. ఈ ఘటన భాలుకాలోని స్క్వేర్ మాస్టర్ బారి ప్రాంతంలోని దుబాలియా పారా వద్ద జరిగింది. కొట్టిచంపిన తర్వాత దుండగులు ఆ యువకుడి మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారని భాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపోన్ మియా "బీబీసీ బంగ్లా"కు తెలిపారు. మృతుడిని దీపు చంద్ర దాస్‌గా గుర్తించారు.…