హనుమకొండ జిల్లాలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని…