దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.