టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో లోకేష్, చంద్రబాబు సిద్ధహస్తులు అని మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు లాంటి మా పాత మిత్రులు వారి తత్వాన్ని గమనించాలని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్షించేందుకు విశాఖకు వచ్చిన లోకేష్.. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.…