కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 14న తెలంగాణ రానున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో పాల్గొనేందుకు వస్తున్నారు అమిత్ షా. వరంగల్ లో రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో, అంతకంటే దీటుగా సభను సక్సెస్ చెయ్యాలని కమలం నేతలు పట్టుదలగా వున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మందిని తరలించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి ఎన్నికల బూత్ కూ, ఈ సభలో…