కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2015లో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా.. సానుకూల మార్పులు కనబడుతున్నాయని ఆయన వెల్లడించారు.