మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.. భోజనం తిన్న వెంటనే విద్యార్ధులు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. వరుస ఘటనలతో బడి భోజనం అంటేనే హడలిపోయే పరిస్దితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడి భోజనం భయపెట్టిస్తోంది. వారం రోజులుగా 10 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి.. వందకు పైగా చిన్నారులు ఆసుపత్రుల పాలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2వేలకు సర్కారు బడులు ఉండగా.. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు మధ్యాహ్న…