కంత్రీగాళ్లు.. కారు అమ్మినట్టే అమ్మి.. మళ్లీ పేపర్స్ చేతుల్లో పట్టుకుని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేటలోని కొన్ని కార్ కన్సల్టెన్సీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి వారిపై ఎన్ని కేసులు నమోదు చేసినా తీరు మారడం లేదు. పోలీసులు కూడా కార్ కన్సల్టెన్సీ ఏజెన్సీ మాయగాళ్లకు సహకరిస్తున్నారని బాధితులు అనుమానిస్తున్నారు.