శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ‘# మెన్ టూ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
నరేశ్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన వినోదప్రధాన చిత్రం 'హ్యాష్ ట్యాగ్ మెన్ టూ' మే 26న విడుదల కాబోతోంది. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు.
ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఆడవాళ్లు పడే ఇబ్బందులు, వాళ్లు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉండే వివక్ష, వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఒత్తిడి, ఇంట్లో ఉండే వేధింపు ఇలా ఆడవాళ్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చి, ప్రేక్షకుల సింపతీని కూడా గెలుచుకొంది హిట్ అయ్యాయి. అయితే సమస్యలు ఆడవాళ్లకి మాత్రమే ఉంటాయా? మగవాళ్లకి ఉండవా? మగవాళ్ళు మనుషులు కాదా అంటున్నాడు బ్రహ్మాజీ అండ్ టీం. నరేష్ అగత్య్స, బ్రహ్మాజీ,…