నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు.అక్కడి నుంచి చెన్నైకి తరలించే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేతలు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.