Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ‘ప్రేమదేశం’ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. శిరీష…
బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ తల్లి నిర్మాత గా మారుతోంది. తన కూతురు కెరీర్ ను గాడిలో పెట్టడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కొందరు కథానాయికలు నిర్మాతలుగా మారారు. అవికా గోర్ తాను నటిస్తున్న దాదాపు అన్ని చిత్రాలకూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇక రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా…