మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో ఏడో బ్లాక్కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవడానికి పలు పరీక్షలు చేయాల్సి ఉంది. తుది నివేదికను జూన్లో అందజేస్తారని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది. పూర్తి నివేదిక…