మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి అందించే స్టైపెండ్ ను భారీగా పెంచింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైపెండ్ అందనుంది. Also…