హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ICRTF) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుండి తరలివచ్చిన 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వైద్య వృత్తిలోని గొప్పతనాన్ని, సమాజం పట్ల వారికి ఉండాల్సిన బాధ్యతను…