Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించింది. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరింది.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.