కార్మిక, కర్షక, శ్రామికుల దినోత్సవంగా మే 1వ తేదీ నిలచింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మే డేని నిర్వహిస్తున్నారు. విప్లవ దినోత్సవంగానూ కొందరు మే డేను అభివర్ణిస్తారు. ఏది ఏమైనా ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీ జేజేలు అందుకుంటోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం 1837లో పోరాటం సాగింది. దాంతో అమెరికా అంతటా రోజుకు పది గంటలు పని గంటలుగా శాసనం చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తరువాత 1862లో మన…